వివేకానందరెడ్డి హత్య కేసులో 30 ప్రశ్నలు అడిగారు.. నా తప్పుంటే బహిరంగంగా ఉరి తీయాలని చెప్పాను: ఆది నారాయణరెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడపలోని తమ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు.

ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పానని ఆది నారాయణరెడ్డి అన్నారు. ఈ హత్యకేసుకు సంబంధించి అన్ని కోణాల్లో తనను 30 ప్రశ్నలు అడిగారని వివరించారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటినీ తాను పూర్తి వివరణ ఇచ్చానని అన్నారు. ఈ కేసులో తన తప్పు ఉంటే తనను బహిరంగంగా ఉరితీయాలని తాను అధికారులకు చెప్పానని వ్యాఖ్యానించారు.

వివేకానందరెడ్డిని హత్య ఎవరు చేశారో అందరి తెలుసు అని ఆది నారాయణరెడ్డి అన్నారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, అప్పుడే నిజానిజాలు వెల్లడవుతాయని ఆయన మీడియా ముందు  తెలిపాడు.