సల్మాన్ సిoగిల్... 100 కార్లు+100 మంది రౌడీలు..... !

దబాంగ్‌', 'దబాంగ్‌ 2' చిత్రాలతో విజయాలను అందుకున్నారు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా సల్మాన్‌ 'దబాంగ్‌ 3' చిత్రంలో నటించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్‌కు జంటగా సోనాక్షి సిన్హా కనిపించనున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'దబాంగ్‌ 3' చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దీంతో సల్మాన్‌ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. 'దబాంగ్‌ 3' సినిమాలో హీరో సల్మాన్,  విలన్‌ గా  కిచ్చా సుదీప్‌ మధ్య క్లైమాక్స్‌ సీన్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించాడు  దర్శకుడు ప్రభుదేవా. హీరో  సల్మాన్,  విలన్ గా కిచ్చా సుదీప్  అతనికి సంబంధించిన 500 మంది అనుచరులతో, 100 కార్లను సైతం పేల్చి ఫైట్‌ చేస్తారట.. దీంతో 'దబాంగ్‌ 3' క్లైమాక్స్‌ గురించి బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ క్లైమాక్స్‌ నిజమో కాదో తెలియాలంటే  'దబాంగ్‌ 3'  థియేటర్లలోకి వచ్చేవరకూ వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా సల్మాన్‌ అభిమానులు మాత్రం ఈ క్లైమాక్స్‌ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.